నేపాల్ నుంచి భారత రాజధానికి డైరెక్ట్ బస్..!
- August 29, 2016
ప్రయాణీకులకు శుభవార్త..! ఇకపై నేపాల్ నుంచి సరాసరి ఢిల్లీ చేరుకునేందుకు వీలుగా కొత్త డైరెక్ట్ బస్ సేవలను నేపాల్ ప్రవేశ పెట్టింది. ప్రయాణీకుల సౌకర్యార్థం పశ్చిమ నేపాల్ డాంగ్ నగరం నుంచి భారత రాజధాని ఢిల్లీకి ఈ డైరెక్ట్ డీలక్స్ బస్సు ను బస్ ఎంటర్ ప్రెన్యూర్స్ కమిటి అధికారికంగా ప్రారంభించింది.
నేపాల్ కు చెందిన రప్తీ జోనల్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్ ఎంటర్ ప్రెన్యూర్స్ కమిటి ప్రయాణీకులకు కొత్త సౌకర్యం కల్పించింది. పశ్చిమ నేపాల్ లో నివసించే ప్రజల సౌకర్యం కోసం భలుబ్యాంగ్ లోని డాంగ్ నగరం నుంచి.. భారత రాజధాని నగరం ఢిల్లీని నేరుగా సందర్శించేందకు కొత్త డీలక్స్ బస్ సేవలను ప్రారంభించింది.
రెండు దక్షిణాసియా నగరాల మధ్య ఇటువంటి డైరెక్ట్ బస్ సౌకర్యం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి అని కమిటీ ఛైర్మన్ సురేష్ హామల్ తెలిపారు. సోమవారం నేపాల్ సమయం ప్రకారం ఉదయం 11.30 సమయంలో డాంగ్ నగరంనుంచి ఢిల్లీకి మొదటి బస్సు ప్రారంభమైనట్లు ఆయన ప్రకటించారు. ప్రతి వారం మూడు బస్సులు డాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నట్లు సురేష్ వెల్లడించారు. ఈ బస్సులో నేపాలీలలకు ఒకవైపు ప్రయాణ ఛార్జీలు రూ.2000 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.1,250 తో సమానంగా ఉంటాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







