పాలలో బెల్లం కలిపి తాగి చూడండి
- August 29, 2016
ప్రతి రోజు లేవగానే పాలు, కాఫీ, టీలు ఇవి తాగుకుంటే రోజంతా గడిచినట్టే ఉండదు. అది కూడా వాటిలో పంచదార వేసుకుని తాగితేనే తాగినట్టుంటుందా.. అయితే ఈ సారి పంచదారకు బదులుగా పాలలో బెల్లం వేసుకుని తాగి చూడండి. ఈ కాంబినేషన్ వల్ల టేస్ట్ మాత్రమే కాదు చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిజానికి పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ బెల్లం కన్నా పంచదార రుచి బాగుండటంతో అందరు దాని వైపే మొగ్గుచూపుతారు. అయితే పాలు, బెల్లం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు పెరగకుండా ఉంటుంది. బెల్లానికి అనీమియా ఎదుర్కోనే శక్తి పుష్కలంగా వుంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పిని పాలద్రోలడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







