మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- November 25, 2026
మిస్ యూనివర్స్ 2026 కిరీటాన్ని ప్యూర్టో రికోకు చెందిన జెన్నిఫర్ బారెటో కైవసం చేసుకున్నారు. ప్యూర్టో రికో రాజధాని సాన్ జువాన్లోని జోస్ మిగ్యుయెల్ అగ్రెలోట్ కొలీజియంలో నవంబర్ 24న జరిగిన 75వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్.. జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు. సొంత గడ్డపై జరిగిన పోటీల్లో తమ దేశానికి చెందిన యువతి విజయం సాధించడంతో ప్యూర్టో రికోలో సంబరాలు మిన్నంటాయి.
3,150 వజ్రాలతో ప్రత్యేక కిరీటం
మిస్ యూనివర్స్ పోటీలు 75 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా నిర్వాహకులు ఈసారి ప్రత్యేకమైన కిరీటాన్ని రూపొందించారు. ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో రూపొందించిన ఈ కిరీటాన్ని జ్యువెలరీ డిజైనర్ జార్జ్ విట్టెల్స్, పారిస్‌కు చెందిన మైసన్ డీఓఆర్ సంస్థ సంయుక్తంగా తీర్చిదిద్దాయి. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేసిన ఈ కిరీటంలో 3,150 వజ్రాలను పొదిగారు. 75వ వార్షికోత్సవ పోటీల్లో ఈ ప్రత్యేక కిరీటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
టాప్ 30లో భారత్ అమ్మాయి.. టాప్ 12కు దూరం
ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మేజో టాప్ 30లో చోటు సంపాదించారు. అయితే, టాప్ 12లోకి ప్రవేశించలేకపోయారు. లా విద్యార్థిని, మోడల్ అయిన కాజియా.. మిస్ యూనివర్స్ ఇండియా 2026 టైటిల్ గెలుచుకున్న తొలి కేరళ యువతిగా గుర్తింపు పొందారు. స్విమ్‌సూట్ రౌండ్ అనంతరం ఎంపికైన టాప్ 12లో ఆమెకు చోటు దక్కలేదు.
ఫస్ట్ రన్నరప్‌గా మెలిస్సా న్యూనెజ్
మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మెలిస్సా న్యూనెజ్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన బియా మిల్లాన్-విండోర్స్కీ మూడో రన్నరప్‌గా, న్యూజిలాండ్‌కు చెందిన జార్జియా వాడింగ్టన్ నాలుగో రన్నరప్‌గా నిలిచారు. దీంతో టాప్ 5లో ప్యూర్టో రికో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ దేశాల ప్రతినిధులు చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!
- కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!
- బహ్రెయిన్ పార్లమెంట్లో ఆహార భద్రతపై చర్చ..!!
- ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ







