కబాలి-2 నిర్మించనున్న ధనుష్
- August 29, 2016
ఒక విజయం మనిషి దశనే మార్చేస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కబాలి చిత్రం భారతీయ సినిమా రికార్డులనే తిరగరాసిందన్నది మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవలసిన విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లను వసూలు చేసిన ఏకైక చిత్రం కబాలి. ఈ రికార్డును ఇప్పట్లో మరో భారతీయ చిత్రం టచ్ చేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇంత భారీ వసూళ్లకు కారణం ఎవరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎస్ ఆయనే సూపర్‌స్టార్ రజనీకాంత్. యువ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడి చేత కబాలిడా అనిపించింది. టాక్‌కు అతీతంగా కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం కబాలి.
ఇంత సంచలన విజయాన్ని సాధించిన చిత్ర దర్శకుడి తదుపరి చిత్రం ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
రంజిత్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇంతకు ముందు సూర్య వెల్లడించారు. అయితే ఆయన ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అంటే రంజిత్ చిత్రం డ్రాప్ అయినట్లే. కాగా కబాలి దర్శకుడితో ఇళయదళపతి విజయ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అదీ వాస్తవ రూపం దాల్చలేదు. తాజాగా రంజిత్ కబాలి సీక్వెల్‌కు కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని తన అల్లుడు ధనుష్ ఉండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తారని, స్వయంగా సూపర్‌స్టారే దర్శకుడు రంజిత్‌కు చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కబాలి-1లో రజనీకాంత్ నటించే అవకాశం ఉందన్నది చెప్పకనే చెప్పినట్లయ్యింది కదూ. కాగా మన సూపర్ స్టార్ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారన్న మాట. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథ మార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అప్పటికి రజనీకాంత్ తాజా చిత్రం 2.ఓ పూర్తి అవుతుందన్నది గమనార్హం.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







