మిలిటరీ ఒప్పందం పై సంతకాలు చేసిన భారత్, అమెరికా
- August 30, 2016
అమెరికా, భారత్‌ల మధ్య మిలిటరీ లాజిస్టిక్స్ ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం రెండు దేశాల ల్యాండ్, ఎయిర్, నావల్ స్థావరాలు పరస్పరం ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక మీదట యుద్ధవిమానాలు, యుద్ధనౌకల మరమ్మతులు, ఇంధన భర్తీ తదితరాల కోసం భారత సైనిక స్థావరాలను అమెరికా, అమెరికా సైనిక స్థావరాలను భారత్ వాడుకోవచ్చు.
సన్నిహిత భాగస్వామ్య దేశాలతో ఏ మేరకు ఒప్పందాలు కుదుర్చుకోగలరో ఆ మేరకు భారత్‌తో రక్షణ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం పంచుకునే అంశాలపై అమెరికా అంగీకరించిందని ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం అనంతరం సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మీడియా సమావేశంలో అమెరికా మంత్రి కార్టర్, భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఇరు దేశాలు నావికాదళం, సంయుక్త ఆపరేషన్స్‌కు, మానవతాదృక్పథంతో సహాయపడే అంశంలో పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. అమెరికా-భారత్‌ల రక్షణ సంబంధాలకు సంబంధించి ఈ ఒప్పందం గొప్ప మైలురాయి అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లోకి అమెరికా దళాలు వెళ్లవని.. జాయింట్ ఆపరేషన్స్ లాజిస్టిక్స్ సులువుగా, ప్రభావవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని కార్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







