‘Dada on Holiday’.. టైటిల్ ను లాంచ్ చేసిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
- November 29, 2026
కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ మూవీకి ‘Dada on Holiday’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఈ సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు.
ఆరుద్ర సినిమాస్, ఫీనిక్స్ ప్రేమ్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ చేతులు కలిపారు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, హ్యూమర్ కలగలిపిన భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
టైటిల్ లాంచ్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మేకర్స్ వినూత్నమైన కాన్సెప్ట్స్‌తో రూపొందించిన ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వీడియోల్లోని క్రియేటివ్ ఐడియాలు, వాటి ప్రెజెంటేషన్, కొత్త తరహా ఎగ్జిక్యూషన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ సినిమా గురించి చర్చ జరిగేలా చేయడంతో పాటు, టైటిల్‌పై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
కిచ్చా సుదీప్ చరిష్మాటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడు ప్రేమ్ ప్రత్యేకమైన విజన్ కలిసి ‘Dada on Holiday’ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుంది.
టైటిల్ లాంచ్ కావడంతో పాటు ప్రమోషనల్ క్యాంపెయిన్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ ఆసక్తికరమైన సినిమాటిక్ జర్నీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ‘Dada on Holiday’’ చిత్రబృందం సిద్ధమవుతోంది
ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ టీమ్
బ్యానర్స్: ఆరుద్ర సినిమాస్, ఫీనిక్స్ ప్రేమ్ స్టూడియోస్
నిర్మాతలు: రూపేష్ కుమార్ జి, శశి కిరణ్ ఆర్, రక్షిత ప్రేమ్
దర్శకత్వం: ప్రేమ్
మ్యూజిక్ డైరెక్టర్: అర్జున్ జన్య
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్ చంద్రు
ఆర్ట్ డైరెక్టర్: శివకుమార్ జె
ఎడిటర్: సంకేత్ ఆచార్
డైలాగ్ రైటర్: అభిజిత్ మహేష్
తాజా వార్తలు
- అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్
- కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!
- అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- దుబాయ్‌లో అపార్ట్మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?
- ఆరోగ్య రంగంలో ఏఐ.. ఖతార్ లో కీలక కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సమీక్షించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్..
- దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
- షార్జాలో ట్రక్కు డ్రైవర్లకు భారీ జరిమానా హెచ్చరిక!







