షార్జాలో ట్రక్కు డ్రైవర్లకు భారీ జరిమానా హెచ్చరిక!
- November 29, 2026
కుడివైపు లేన్లలోనే ట్రక్కుల ప్రయాణం.. బ్రేక్‌డౌన్ సమయంలోనూ భద్రతా చర్యలు తప్పనిసరి
షార్జా: ట్రక్కు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని షార్జా పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా భారీ వాహనాలు రహదారిపై కుడివైపు లేన్లలోనే ప్రయాణించాలని, ఇతర లేన్లను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించకూడదని సూచించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే Dh1,500 జరిమానాతో పాటు 12 బ్లాక్ పాయింట్లు విధించనున్నట్లు స్పష్టం చేశారు.
తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో విడుదల చేసిన రహదారి భద్రతా సూచనల్లో భాగంగా పోలీసులు పలు కీలక మార్గదర్శకాలను వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీగా ఉన్నప్పుడు లేదా ఓవర్‌టేకింగ్ నిషేధించిన ప్రాంతాల్లో ఇతర వాహనాలను అధిగమించేందుకు ప్రయత్నించకూడదని ట్రక్కు డ్రైవర్లకు సూచించారు. రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సంకేతాలు, సిగ్నళ్లను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ట్రక్కు బ్రేక్‌డౌన్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రయాణ సమయంలో ట్రక్కు మొరాయిస్తే వాహనాన్ని రహదారికి అత్యంత కుడివైపున సురక్షితంగా నిలపాలి. వెంటనే హజార్డ్ లైట్లను ఆన్ చేసి, వాహనం వెనుక తగిన దూరంలో హెచ్చరిక త్రిభుజం (Warning Triangle) ఏర్పాటు చేయాలి. అనంతరం ట్రాఫిక్‌కు దూరంగా సురక్షిత ప్రాంతానికి వెళ్లి అత్యవసర సేవలను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
బ్లైండ్ స్పాట్స్ పై అప్రమత్తత అవసరం
ట్రక్కుల చుట్టూ ఉండే బ్లైండ్ స్పాట్స్‌లో ఇతర వాహనదారులు ప్రయాణించడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. భారీ వాహనాల వెనుక ప్రయాణించేటప్పుడు తగినంత దూరం పాటించాలని, వాటి పక్కన ప్రమాదకరంగా వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని షార్జా పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్
- కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!
- అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- దుబాయ్‌లో అపార్ట్మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?
- ఆరోగ్య రంగంలో ఏఐ.. ఖతార్ లో కీలక కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సమీక్షించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్..
- దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
- షార్జాలో ట్రక్కు డ్రైవర్లకు భారీ జరిమానా హెచ్చరిక!







