దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
- November 29, 2026
దోహా: ఖతార్‌లోని బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నవంబర్ 26, 2026న నిర్వహించిన ఈ వేడుకలకు ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నూతన ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచనా విధానం, సాంకేతిక అభివృద్ధి, సమగ్ర విద్య కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నూతన విధానాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
భారత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 'వికసిత్ భారత్' సాధనలో ప్రగతిశీల, సమ్మిళిత విద్యా వ్యవస్థ ఎంతో కీలకమని ఆయన అన్నారు. దేశాభివృద్ధితో పాటు సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి విద్య ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం ద్వారా భవిష్యత్తు ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే తరాన్ని నిర్మించవచ్చని రాయబారి తన ప్రసంగంలో వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్
- కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!
- అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- దుబాయ్‌లో అపార్ట్మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?
- ఆరోగ్య రంగంలో ఏఐ.. ఖతార్ లో కీలక కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సమీక్షించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్..
- దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
- షార్జాలో ట్రక్కు డ్రైవర్లకు భారీ జరిమానా హెచ్చరిక!







