సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!

- November 29, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!

రియాద్: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి రాబోయే నాలుగు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోయలు, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) విడుదల చేసిన వాతావరణ అంచనాల నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ ఈ హెచ్చరిక జారీ చేసింది. వర్షాల సమయంలో అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను పాటించాలని, వార్తా మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా వెలువడే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని ప్రజలకు సూచించింది.

రియాద్, మక్కా ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువ

మక్కా ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. వడగళ్ల వానతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, దుమ్ము, ఇసుక గాలిలోకి ఎగసిపడవచ్చని హెచ్చరించింది. రియాద్ ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. వడగళ్ల వాన, బలమైన గాలుల కారణంగా దుమ్ము, ఇసుక తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.

ఈ ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచన

మక్కా, రియాద్‌తో పాటు తబూక్, అల్ జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్, తూర్పు ప్రావిన్స్, మదీనా, హాయిల్, ఖాసిమ్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని NCM వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో కూడా ఆకస్మిక వరదలు, వడగళ్ల వాన, బలమైన గాలులు, దుమ్ము, ఇసుక తుఫానులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వర్షాలు కురిసే సమయంలో లోయలు, నీరు ప్రవహించే మార్గాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని సివిల్ డిఫెన్స్ మరోసారి సూచించింది. అధికారిక భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com