అభ్యంతరకర వీడియో: విద్యార్థుల అరెస్ట్
- August 31, 2016
అభ్యంతరకర వీడియో కేసులో ముగ్గురు విద్యార్థుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు టీనేజ్ కుర్రాలు ఇందులో, అభ్యంతరకరంగా నటించారు. వీడియోని మరో కుర్రాడు చిత్రీకరించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో ఉందిప్పుడు ఈ కేసు. గత ఏప్రిల్‌లో మస్కట్ ప్రైమరీ కోర్ట్, ముగ్గురు యువకులకు ఇలాంటి కేసులోనే ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే 1000 రియాల్స్ ఫైన్ కూడా విధించడం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో, ఓ ఒమనీ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపర్చినందుకుగాను నెల రోజుల జైలు, 2000 రియాల్స్ ఫైన్ ఎదుర్కొన్నాడు. అందులో సగం బాధితురాలైన యువతికి కాంపన్సెషన్ కింద ఇవ్వడం జరిగింది. ఒమన్ సైబర్ చట్టం, ఆర్టికల్ 16 ప్రకారం ఇతరుల ప్రైవేటు లైఫ్‌కి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోల్ని తీసి, ప్రచారంలోకి తెస్తే జైలు శిక్షతోపాటు, భారీ జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







