అబూధాబీ టవర్లలో అగ్నిప్రమాదం 13 మంది ఊపిరందక సతమతం
- August 30, 2016
అబూధాబీ : స్థానిక జాహితా ప్రాంతంలో మంగళవారం రెండు నిర్మాణంలో ఉన్న భవనాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదమూడు మంది, మరో పది మంది అగ్నిమాపక దళ సభ్యులు ఊపిరి అంధక స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారు..
అబూధాబీ సివిల్ డిఫెన్స్ డైరక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అల్ అన్సారీ, మాట్లాడుతూ కార్యకలాపాలు గది వద్దకు 10:50 గంటలకు అగ్నిప్రమాదం గూర్చి సమాచారం అందుకొన్నామని నివేదిక అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి వెంటనే ఫైర్ ఇంజన్లు పంపినట్లు ఆయన తెలిపారు. ముఖ్యులైన ఇంటర్వెన్షన్ యూనిట్ నుండి ఒక ఉమ్మడి బృందం రెండు టవర్లలో చిక్కుకున్నపలువుర్ని ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని నివాస భవనాలలో నుంచి వారినీ రక్షించి ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అందించిన తాత్కాలిక ఆశ్రయంలో వారినీ ఉంచారని ఆయన తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, సిటీ టెర్మినల్ పక్కన ఒక అబూ ధాబీ మాల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 27 అంతస్థుల భవనంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అగ్ని రాజుకొని మంటలు వేగంగా వ్యాపించాయి. ఆరేడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు రంగంలోనికి దిగేయి. మరి కొన్ని వాహనాలు మార్గం మధ్యలో ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ మెషిన్ లో ఏర్పడిన తప్పు కారణంగా అగ్ని ప్రామాదం జరగడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.ఈ అగ్ని ప్రమాదం నిర్మాణ ప్రాంతంలో 600 మంది కార్మికులు ఉండగా జరిగినట్లు ఒక కార్మికుడు తెలిపాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







