'టాసా' ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ సంబరాలు...
- August 31, 2016
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ఇవాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. సౌతాఫ్రికాలోని మిడ్‌ర్యాండ్ సిటీ, నూర్డ్‌విక్ సేజ్‌వుడ్ స్కూల్‌లో ఈ సంబరాలను నిర్వహించనున్నామని వారు తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఈ సంబరాలకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని అన్నారు. సంబరాల్లో భాగంగా ఔత్సాహిక మహిళలకు వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో బతుకమ్మ పోటీలను నిర్వహించనున్నామని, గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







