ఛారిటీతో అక్రమ వసూళ్ళు: తస్మాత్ జాగ్రత్త
- August 31, 2016
రెసిడెంట్స్ అలాగే సంస్థలు ఛారిటీ కోసం వసూళ్ళను అక్రమంగా చేపడితే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆస్ట్రేలియా - బ్రిటిష్ నేషనల్ ఒకర్ని దుబాయ్ పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ (ఐఎసిఎడి) ఈ మేరకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అరెస్టయిన వ్యక్తి పేరు స్కాట్ రిచార్డ్స్. యూఎస్ రిజిస్టర్డ్ ఛారిటీ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తూ, ఫేస్ బుక్ ద్వారా ఫండ్ రెయిజింగ్‌ని ప్రారంభించి దొరికిపోయాడు. బెయిల్‌పై ఆయన్ను విడుదల చేసినట్లు తెలియవస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఛారిటీ పేరుతో అక్రమ వసూళ్ళకు పాల్పడితే 5000 నుంచి 100,000 దిర్హామ్‌ల వరకు జరీమానాతోపాటు ఏడాది జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చట్టం చెబుతోంది. ఛారిటీ కార్యక్రమాలు చేపట్టాలనుకునేవారెవరైనాసరే నిబంధనల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







