వరల్డ్ ఎక్స్‌పాట్ ఇండెక్స్: కువైట్‌కి చివరిస్థానం
- September 01, 2016
గ్రీస్, నైజీరియాతో కలిసి కువైట్ ఆఖరి మూడు స్థానాల్లో చోటు దక్కించుకుంది వరల్డ్ ఎక్స్‌పాట్ ఇండెక్స్‌లో. వలసదారులకు అత్యంత స్నేహశీలి దేశాల్లో తైవాన్, మాల్టా ముందున్నాయి. ఎక్స్‌పాట్ ఇన్సైడర్ సర్వే - ఇంటర్నేషన్స్ గ్రూప్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్‌కి ఆఖరి స్థానం దక్కింది. 60కి పైగా దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేకి సంబంధించి అనేక విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. కుఐవట్లో 6 శాతానికి పైగా వలసదారులున్నారు. కువైట్ సహా పలు జిసిసి దేశాలకు కూడా ర్యాంకింగులు బ్యాడ్‌గానే ఉన్నాయి. ఖతార్ 55, సౌదీ అరేబియా 63, కువైట్ 65వ స్థానంలోనూ నిలిచాయి. యూఏఈ 23 స్థానంలో నిలవగా, ఒమన్ 32వ స్థానంలో నిలిచింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఆధారంగా ఈ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయాల్ని తెలిపారు. ఖాళీగా వున్న సమయంలో వారి సంతృప్తి, ట్రావెల్ మరియు ట్రాన్స్‌పోర్టేషన్, హెల్త్ సర్వీసెస్, భద్రత మరియు వ్యక్తిగత ఆనందం వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. విదేశాల్లో పని చేయడానికి సంబంధించి సంతృప్తికరమైన దేశాల కేటగిరీలో కువైట్‌కి 47వ స్థానం వచ్చినా, ఇతరత్రా కారణాలతో వరల్డ్ ఎక్స్‌పాట్ ఇండెక్స్‌లో చివరి స్థానాన్ని దక్కించుకుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







