ఇద్దరు పోలీసుల మృతికి కారణమైన ఒంటె
- September 01, 2016
ఓ ఒంటె కారణంగా ఇద్దరు రాయల్ ఒమన్ పోలీసులు మృతి చెందిన ఘటన ముదైబిలో చోటుచేసుకుంది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతోన్న ఒంటెను, రాయల్ ఒమన్ పోలీసులకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఇద్దరు పోలీసులు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే ఒంటెలతో వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒంటెల్ని పెంచుకుంటున్నవారు, వాటిని రోడ్లపైకి విచ్చలవిడిగా వదిలేయరాదనీ, రాత్రి వేళల్లో ఒంటెల కారణంగా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







