సెప్టెంబర్ 3న విడుదల కానున్న 'నారదుడు'
- September 01, 2016
సూరజ్ ప్రొడక్షన్స్ -టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం "నారదుడు". ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి తెలుగు అనువాద రూపమిది. "బిచ్చగాడు" కధానాయకుడు విజయ్ ఆంటోనీ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాతలు మాట్లాడుతూ.. "ధనుష్ పెర్ఫార్మెన్స్, జెనీలియా, శ్రియల గ్లామర్ తో పాటు ప్రతి సన్నివేశంలోనూ పండే కడుపుబ్బ నవ్వించే కామెడీ, విజయ్ ఆంటోని సంగీతం, శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు "నారదుడు" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. ధనుష్ సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా మేళవించిన చిత్రమిది. "అభినవ నారదుడు" లాంటి ధనుష్ పాత్ర ఇటు మాస్.. అటు క్లాస్ ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరిస్తుంది. సెప్టెంబర్ 3న అత్యధిక ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.
గీత, శంకరాభరణం రాజ్యలక్ష్మి, భాగ్యరాజా, ఆశిష్ విద్యార్థి, జయప్రకాశ్ రెడ్డి, వివేక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర-వెన్నెలకంటి-శివగణేష్, సంగీతం: విజయ్ ఆంటోని, నిర్మాతలు: ఉమ- వై.వి.సత్యనారాయణ, దర్శకత్వం: జవహర్!!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







