ఆఫర్ల కోసం 'లైక్'లను టచ్ చేయొద్దు
- September 01, 2016
సోషల్ మీడియాలో లైక్లు షేర్లు చేయడమంటే మీకిష్టమా? మంచి మంచి ఆఫర్లు కన్పిస్తున్నాయని సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారా? అయితే మీ కోసమ ఈ హెచ్చరిక. ఎమిరేట్స్, ఫ్లై ఎమిరేట్స్ లోగోతో కూడిన కొన్ని ఆఫర్లు ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. లైక్స్, షేర్స్ చేయడం ద్వారా ఏడాది అంతటా ఎమిరేట్స్ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు స్కామర్లు ఉత్తుత్తి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆఫర్కి 32,000 మంది లైక్లు, షేర్లు ఇచ్చేశారు. ఈ ప్రచారంపై ఎమిరేట్స్ సంస్థని సంప్రదించినప్పుడు ఎమిరేట్స్ వర్గాలు పూర్తిగా ఇదంతా అవాస్తమవని పేర్కొన్నాయి. ప్రత్యేకంగా తమకున్న అధికారిక సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా మాత్రమే తమ ఆఫర్లను ప్రకటిస్తామని ఎమిరేట్స్ అధికారులు చెప్పారు. గతంలో ఇలాంటి సంఘటన వెలుగు చూసినప్పుడు స్కామర్స్పై లీగల్ చర్యలకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. ఎవరూ అలాంటి స్కామర్స్ని విశ్వసించరాదని ఎమిరేట్స్ వర్గాలు వినియోగదారుల్ని కోరాయి.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







