'వై.ఎస్.ఆర్' కు ఘన నివాళి
- September 02, 2016
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతిని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, సోదరి షర్మిల తదితరులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ తెలుగురాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







