మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్‌పై మరో మూడు లేన్ల ప్రారంభం
- September 02, 2016
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్‌పై మూడు కొత్త లేన్లను నేడు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రారంభంతో అల్ యాలాయిస్ రోడ్ జంక్షన్ నుంచి జెబెల్ అలి లిహెబాబ్ రౌండెబౌట్ నుంచి అబుదాబీ వైపు మొత్తం ఆరు లేన్లు అందుబాటులోకి వస్తాయి. రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ వైడెనింగ్ ప్రాజెక్టులో భాగంగా ఈ విస్తరణను చేపట్టింది. ఈ తాజా ప్రారంభంతో రోడ్డుపై ట్రాఫిక్ మరింత స్మూత్‌గా ఉంటుందని ఆర్టిఎ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ డైరెక్టర్ నబీల్ సలియా చెప్పారు. గత ఫిబ్రవరిలో ఆర్టిఎ మూడు లేన్లను ఈ రోడ్డు వైడెనింగ్ ప్రాజెక్ట్‌లో ప్రారంభించింది. సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ లేన్లను ప్రారంభించారు. షేక్ బిన్ జాయెద్ రోడ్ని అతి ప్రమాదకరమైన రోడ్డుగా గతంలో పోలీసులు నిర్ధారించి, రోడ్డు విస్తరణ పనుల్ని చేపట్టారు. 14 అతి తీవ్రమైన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రమాదాల జాబితాలో ఎమిరేఓట్స్ రోడ్డు 9 ప్రమాదాలతో రెండో స్థానంలో నిలిచింది. వాహనాల మధ్య సరైన దూరం పాటించడం, అలాగే ఉన్నపళంగా వాహనాల వేగాన్ని తగ్గించడం లేదా టర్నింగ్స్ తీసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణాలుగా అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







