రోడ్డు మార్గంలో హజ్ వచ్చేవారికి నేటితో ముగియనున్న గడువు
- September 02, 2016
రోడ్డు మార్గంలో వచ్చే హజ్ యాత్రీకులకు డెడ్‌లైన్ నేటితో (శుక్రవారం సెప్టెంబర్ 2) ముగియనుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ వెల్లడించింది. గడువు ముగియనున్న దరిమిలా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గడవు లోపు యాత్రీకులు హజ్ కోసం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంకో వైపున జిసిసి దేశాల నుంచి హజ్ యాత్రకు వచ్చేవారు, తమ వెంట ఆయా దేశాలు ఇచ్చే పర్మిట్స్‌ని తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలనీ, లేని పక్షంలో వారిని తిరిగి పంపించేస్తామని జనరల్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. గ్రాండ్ మాస్క్ వద్ద మతాఫ్ సెక్షన్ నుంచి వీల్‌చైర్స్ వినియోగంపై బ్యాన్ విధించామనీ, ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు కోరారు. యాత్రీకుల భద్రత నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. మక్కా టన్నెల్స్ అన్నీ పలు టీమ్‌లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, టాక్సిక్ గ్యాస్ విషయమై పరీక్షలు నిరంతరం జరుగుతాయనీ, అనుకోని సంఘటనలు ఎదురైతే వెంటనే తగిన చర్యలు తీసుకోబడ్తాయని సివిల్ డిఫెన్స్ చీఫ్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ దులైవి చెప్పారు. వీల్ చైర్స్ డిపార్ట్‌మెంట్, 300 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్‌చైర్స్‌ని అందుబాటులో ఉంచామనీ, ఇరవై నాలుగ్గంటలూ అవి అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. హజ్ సీజన్‌లో ఉష్ణోగ్రతలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







