భజరంగి భైజాన్ చిత్రంను రీమేక్ చేయబోతున్న పవర్ స్టార్
- August 03, 2015
బాలీవుడ్ లో సంచలన విజయం సాదించిన సల్మాన్ చిత్రం భజరంగి భైజాన్. ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.. తాజాగా ఈ చిత్ర రీమేక్ హక్కులను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు & రాక్ లైన్ వెంకటేష్ ఇరువురు కలిసి పొందాలని ప్రయత్నిస్తున్నారు.. సల్మాన్ నటించిన ఈ అద్భుత పాత్రను తెలుగు లో అధిక ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాబోతున్నాడని వార్త. గతం లో సల్మాన్ నటించిన దబంగ్ చిత్రం తెలుగు లో గబ్బర్ సింగ్ రీమేక్ గా వచ్చి రికార్డ్స్ బద్దలు కొట్టిన సంగతి తెల్సిందే..మళ్లీ అదే సల్మాన్ చిత్రం భజరంగి భైజాన్ ని తెలుగు లో పవన్ - హరీష్ శంకర్ కలిసి రీమేక్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు అనుకుంటున్నాడు.. త్వరలోనే ఈ చిత్రం గురించి ఓ అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సర్దార్ (గబ్బర్ సింగ్ 2) చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు..హరీష్ శంకర్ కూడా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం తో బిజీ గా ఉన్నాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







