షార్జా-దుబాయ్ నూతన స్లిప్ రోడ్ ప్రారంభం
- September 05, 2016
షార్జ: షార్జా-దుబాయ్ స్లిప్ నూతన రహదారిని ఆదివారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ప్రారంభించబడింది.
200 మిలియన్ డి హెచ్ వ్యయంతో నిర్మించబడిన ఈ రహదారి షార్జ నుండి దుబాయ్ వైపు ప్రయాణం కొనసాగించే వాహనదారుల సౌకర్యార్ధం ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఈ మార్గం ద్వారా ప్రయాణించే వారికి ప్రయాణ సమయం కలిసిరావడమే కాకుండా వాహనాల రద్దీ ఇబ్బంది లేకుండా సులువుగా ప్రయాణం కొనసాగేందుకు సహాయపడుతుంది.
ఈ స్లిప్ రహదారి అల్ బాడీ'ఆ ప్రాజెక్ట్ లో ఒక భాగం. షార్జాలోని మాలియా మరియు ఎమిరేట్స్ రహదారుల కూడలిని అభివృద్ధి చేసే లక్ష్యంతో మంత్రిత్వశాఖ అమలు చేయనుంది. షార్జా డుబై ప్రయాణించే వాహనాలు స్లిప్ రోడ్ ని చేరుకొనే ముందు మూడు దారులు, రెండు కిలోమీటర్ల దూరం పాటు కొనసాగిన తర్వాత ఆ రోడ్డుతో జతకూడేలా రూపకల్పన చేశారు. మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ వర్క్స్ సెక్టార్ సహాయ కార్యదర్శి ఇంజినీర్ హాసన్ ఆల్ మాంసూరి ఈ సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ముందుగా అనుకొన్న షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్టు ను ఎంతో చురుకుదనంతో మంత్రిత్వ శాఖ పూర్తి చేసిందని తెలిపారు.స్లిప్ రోడ్ ని చేరుకొనే ముందు మూడు దారులు విస్తృతపర్చడం ద్వారా ట్రాఫిక్ ప్రవాహన్నీ తగ్గించడం ముఖ్యంగా కీలక సమయాలలో తగ్గించేందుకు ఇది జతచేయబడింది, "ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







