మరో మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
- September 05, 2016
ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. మరో మూడు బాలిస్టిక్ క్షిపణులను మంగళవారం ఉత్తర కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మీడియా సంస్థ యొన్హప్ వెల్లడించింది. వాంగ్జు కౌంటీ నుంచి తూర్పు సముద్రం(సీ ఆఫ్ జపాన్) వైపు ఈ క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా నిర్వహించినట్లు యొన్హప్ తెలిపింది. హైడ్రోజన్ బాంబ్ ప్రయోగాన్ని నిర్వహించిన ఉత్తర కొరయా బాలిస్టిక్ క్షిపణుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రెండు వారాల క్రితం ఓ సబ్ మెరైన్ నుంచి ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ సముద్రజలాల్లో పడటంతో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా ఉత్తర కొరియా పరీక్షలు జరిపిన తీరును జపాన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
తాజా వార్తలు
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు







