సౌదీ జీతాలు 2017లో ఇలా వుండొచ్చు
- September 05, 2016
సౌదీ అరేబియాలో జీతాలకు సంబంధించి ఇదొక శుభవార్త. జిసిసి దేశాలకు సంబంధించిన సర్వే ప్రకారం, వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జీతాల్లో 4.9 శాతం పెరుగుదల ఉండొచ్చని తేలింది. ఇది జిసిసిలోని మిగతా దేశాలతో పోల్చితే ఎక్కువే. గ్లోబల్ రిక్రూట్‌మెంట్ కంపెనీ ఏయాన్ హెవిట్ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది 4.6 శాతం ఇంక్రిమెంట్ ఉందని తేల్చింది. 2017లో సరాసరి 4.7 శాతం పెరుగుదల ఉండొచ్చని సర్వే ద్వారా వెల్లడయ్యింది. 2016లో ఈ సంస్థ అంచనాల మేరకే జీతాల పెరుగుదల శాతం నమోదయ్యింది. ఫార్మాస్యూటికల్, మీడియా మరియు ఫుడ్, బెవరేజ్, టొబాకో ఇండస్ట్రీస్ గత ఏడాది మంచి పెరుగుదలనే నమోదు చేశాయి. టెల్కోస్, కన్‌స్ట్రక్షన్, ఆయిల్ మరియు గ్యాస్ తదితర విభాగాల్లో పెరుగుదల తక్కువే నమోదయ్యింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రభావం కూడా జీతాల పెరుగుదలపై బాగానే పడనుంది. ఇంకో వైపున ఒమన్, యూఏఈ కూడా 2017లో 4.6 శాతం జీతాల పెరుగుదలను నమోదు చేయవచ్చు. కువైట్‌కి చెందిన సంస్థలు 4.8 శాతం పెరుగుదలను నమోదు చేయడానికి ఆస్కారముంది. బహ్రెయిన్‌లో 4.7 శాతం వరకు ఈ పెరుగుదల ఉంటుందని అంచనా. రీజియన్‌లో అతి తక్కువ జీతాల పెరుగుదలను ఖతార్ నమోదు చేయవచ్చు. ఈ శాతం 4.5గా ఉండొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







