రెండు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు
- September 05, 2016
దుబాయ్: రెండు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది గాయపడగా, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శని, ఆదివారాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంక్రీట్ మిక్సర్ ప్రమాదంలో దగ్ధమయ్యింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. సెర్బియన్ వ్యక్తి తాను నడుపుతున్న కారుతో, ఇండియన్ వ్యక్తి నడుపుతున్న వాహనాన్ని డీకొన్నాడనీ, క్షణాల్లోనే ఓ బస్సు ఈ వాహనాల్ని ఢీకొందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 14 మంది గాయపడ్డారు. ఆదివారమే జరిగిన ఇంకో ఘటనలో ఓ వాహనం, మెటల్ బారియర్‌ని ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దుబాయ్ అల్ అయిన్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







