దుబాయ్‌లో 'ఓవిలియా గణేష్ ఫెస్టివల్'
- September 05, 2016
దుబాయ్: ప్రతిసారిలానే దుబాయ్‌లో ఈసారి కూడా ఓవిలియా నేతృత్వంలో గణేష్ ఫెస్టివల్ అంగరంగ వైబవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందినవారిని ఈ వేడులకు నిర్వాహకులు ఆహ్వానించారు. ఇండియన్ నవ్ - వారి పైతాని శారీస్, జాస్మిన్ ఫ్లవర్స్‌తో, సంప్రదాయ ఆభరణాలతో కార్యక్రమం కన్నుల పండుగగా పెంట్ హౌస్ ఆఫ్ హ్వతోర్న్ సూట్స్,జె బి ఆర్ లో జరిగింది. . ఇండియన్ కల్చర్ మరియు ట్రెడిషన్స్, ఇండియన్ ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండా ఒలీవియా సొంత ఖర్చులతో ఈ ఈవెంట్‌ని నిర్వహించింది. మొత్తం 8 మంది స్త్రీలు, ముగ్గురు పురుషుల్ని ఈ వేడుకకు అతిథులుగా ఆహ్వానించారు. ఇందులో 2 భారతీయులు, ఒకరు లెబనీస్, ఒకరు సింగపూరీయన్, ఒకరు ఫిలిప్పినో, ఒకరు కెన్యన్, ఇంకొకరు ఉగాండియాన్ మహిళలున్నారు. పురుషుల్లో ఒకరు భారతీయులు కాగా, ఇంకొకరు అమెరికన్. కెన్యన్ మాట్లాడుతూ సంప్రదాయ దుస్తుల్లో తాను పెళ్ళికూతురిలా ఉన్నట్లు చెప్పారు. సింగపూర్‌కి చెందిన వ్యక్తి మాట్లాడుతూ, ఓవిలియా నిర్వహించే ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు తానెప్పుడూ ఆసక్తితో ఉంటాననీ, అక్కడే సంప్రదాయాల గురించి బాగా అవగతమవుతుందని అన్నారు. ఒలీవియా కాన్సెప్ట్ తనకు నచ్చిందని లెబనీస్ చెప్పారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ - దుబాయ్ ప్రెసిడెంట్ గిరీష్ పంత్, అపర్నా నాయక్, సుదేష్ షిండే తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముబరాకియా జ్యువెలరీని అందించగా, మేకప్ నగ్మా అకీల్, ఫొటోగ్రఫీ టోనీ జార్జ్ నిర్వహించారు.



తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







