'ఎమిరేట్స్' విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక
- September 06, 2016
గత నెలలో దుబాయ్ విమానాశ్రయంలో జరిగిన ఎమిరేట్స్ విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను మంగళవారం అధికారులు వెల్లడించారు. ల్యాండ్ అవుతున్న విమానాన్ని తిరిగి పైకి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు విశ్లేషించారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా ఇది రికార్డుకెక్కింది. అయితే అదృష్టవశాత్తూ 300 మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు.
ఈ విమాన ప్రమాదంపై అరబ్ ఎమిరేట్స్ పౌర విమాన అధికార యంత్రాంగం దర్యాప్తు జరిపింది. ఫ్లైట్ డేటా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంభాషణ, ఆయా రంగాల విశ్లేకుల ఇంటర్వూలతో కూడిన 28 పేజీల నివేదికను రూపొందించారు.
కేరళలోని తిరువనంతపురం నుంచి దుబాయ్ విమానాశ్రాయానికి చేరిన ఈ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే రన్ వేపై దిగినంతలోనే మళ్లీ పైకి ఎగిరించే క్రమంలో ముందు చక్రం తెరుచుకోలేదు. అప్పటికే 125 నాట్స్ వేగంతో విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం దూసుకెళ్ళింది. ఆ రాపిడికి విమానం ఇంజన్‌కు మంటలు అంటుకోవడంతో కొద్ది క్షణాల్లో అది పూర్తిగా కాలిపోయింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







