ప్రత్యేక హోదా వేటికి లభించిందో తెలుసా??

- September 07, 2016 , by Maagulf
ప్రత్యేక హోదా వేటికి లభించిందో తెలుసా??

ప్రత్యేక హోదా ఏ ప్రాంతాలకు వర్తిస్తుందన్న విషయంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్యాకేజీ ప్రకటన గురించి మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా అనేది కేవలం కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలకే వర్తించాలని 14వ ఫైనాన్స్‌ కమిషన్ చెప్పిందని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని నిశితంగా చర్చించామన్నారు. 14వ ఫైనాన్స్‌ కమిషన్ నిబంధనల వల్ల సాధ్యపడలేదని అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రత్యేక హోదా కాకుండా దానికి సమానమైన ప్రయోజనాలు కల్పించే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నామని జైట్లీ చెప్పుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com