బహ్రెయిన్ నేషనల్ డాక్యుమెంట్ పై సంతకాలకు గడువు పెంపు
- August 04, 2015
విదేశాలలో ఉన్న బహ్రైనీలు నేషనల్ డాక్యుమెంటుపై సంతకాలు చేయడానికి వీలుగా, ముహర్రక్ క్లబ్ వారు గడువును పెంచారు. దీనివలన డాక్యుమెంటును వెబ్-సైట్ లో విడుదల చేయడానికి మరికొంత సమయం పట్టచ్చు. ఇక, సిట్రా లో తీవ్రవాద బాంబుదాడికి వ్యతిరేకంగా మంత్రివర్గం విడుదల చేసిన స్టేట్మెంట్ కు సంఘీభావంగా, బహ్రెయిన్ ఆంతరంగిక వ్యవహారాలలో ఇరాన్ అనవసర జోక్యాన్ని ఖండిస్తూ - ప్రస్తుత, గత పార్లమెంటు సభ్యులు, మునిసిపాలిటీ మెంబర్లు, స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు మరియు అనేక సంఖ్యలో పౌరులు సంతకాలు చేశారు. అంతేకాకుండా, తీవ్రవాద బాంబుదాడి నిందితుల పై న్యాయవిచారణ జరిపించడంలో ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా గారి కార్యదీక్షతను అనేకులు ప్రశంసించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







