రాముడి మంచితనం
- August 04, 2015
రాముడు, భీముడు మంచి స్నేహితులు. రాముడు మంచితనానికి మారు పేరు. కానీ భీముడు అవకాశవాది. కపట బుద్ధి కలవాడు. ఒకరోజు వాళ్లిద్దరూ కలిసి ఆడవిగుండా పొరుగూరికి పనిమీద బయలుదేరారు. ఇంతలో ఒక సింహం గాండ్రింపు వినబడింది. అది చూసి వాళ్లిద్దరూ దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి భయంతో బిక్కుబిక్కుమని చూడసాగారు. ఆ సింహం వీరిని చూడనే చూసింది. అసలే అది ఆకలితో ఉండడం వల్ల వీళ్లని తినేయాలని ఆత్రుతతో ఆ చెట్టు వద్దకి వచ్చింది. చెట్టు పైకి చూస్తూ నీ వెంట ఉన్న ఇంకొక వ్యక్తిని కిందికి తోసెయ్యి. నేను అతనితో నా ఆకలి తీర్చుకుని నిన్ను వదిలేస్తాను అని రాముడితో అంది. అందుకు రామయ్య అతను నా స్నేహితుడు నేను అతన్ని కిందికి పడనివ్వను అన్నాడు. అప్పుడు సింహం నీ ప్రాణం దక్కించుకోవాలంటే నువ్వు నీ స్నేహితుణ్ణి కిందకి తోసేయ్ లేకపోతే నేను మిమ్మల్నిద్దర్నీ చంపి తినేస్తాను అని భీముడితో అంది. అందుకు భీముడు తన స్నేహాన్ని మరిచిపోయి రాముడ్ని కిందికి తోసేశాడు. మంచితనం వల్ల దేవుడి దయ వల్ల రాముడు కింద పడకుండా చెట్టు కొమ్మకు వేలాడుతూ ఎలాగోలా మళ్లీ చెట్టుపైకి చేరుకున్నాడు. చూశావా నీ స్నేహితుడి కపట బుద్ధి. ఇప్పటికైనా అతన్ని కిందకి తోసెయ్ అంది మళ్లీ రాముడితో సింహం. లేదు లేదు వాడు చెడ్డవాడైనా వాడు నాకు స్నేహితుడే నా స్నేహితుణ్ణి చావనివ్వను అన్నాడు రాముడు. అతని మంచితనానికి విస్తుపోయిన సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది. భీముడు తను చేసిన మిత్ర ద్రోహానికి సిగ్గుపడి రామున్ని క్షమాపణలు వేడుకున్నాడు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







