'తలాక్' విధానం అభ్యంతరకరం

- September 10, 2016 , by Maagulf
'తలాక్' విధానం అభ్యంతరకరం

ముస్లింలు విడాకులివ్వడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఉపాధ్యక్షుడు మౌలానా కల్బే సాధికి వ్యతిరేకించారు. మూడుసార్లు తలాక్ చెప్పి, విడాకులు ఇవ్వడం గురించి ఆయన మాట్లాడుతూ విడాకులు తీసుకోవాలని స్త్రీ, పురుషులిద్దరూ నిర్ణయించుకునే వరకు చర్య తీసుకోకూడదన్నారు. హిందుత్వం మాదిరిగానే తమకు కూడా అనేక నిబంధనలు ఉన్నాయన్నారు. భర్త మూడు లక్షలసార్లు తలాక్ అని చెప్పినప్పటికీ చెల్లుబాటు కాకుండాపోయే అవకాశం కూడా ఉందన్నారు. విడాకులు, భార్యను పోషించడం వంటి వివాహ సంబంధ విషయాల్లో ముస్లిం మహిళలకు ఉన్న హక్కులపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 2న ఆలిండియా పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు తమ అభిప్రాయాలను తెలిపింది. బహుభార్యత్వాన్ని, ట్రిపుల్ తలాక్‌ను సమర్థించింది. ఈ అంశాలు తమ మతానికి సంబంధించినవి కనుక న్యాయస్థానాలకు అధికార పరిథి లేదని పేర్కొంది. తమ మతానికి ఖురాన్, షరియా చట్టం ఆధారమని తెలిపింది.

మూడుసార్లు తలాక్ చెప్పే విధానాన్ని నిషేధించాలని ఆలిండియా ముస్లిం వుమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు శైష్ట అంబర్ డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com