తంగవేలుకు జయలలిత ప్రభుత్వం భారీ నజరానా
- September 10, 2016
పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తంగవేలును ప్రత్యేకంగా అభినందించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలిత.. ఆ అథ్లెట్ కు రూ. 2 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు పారాలింపిక్స్ లో సత్తాచాటిన మరియప్పన్, వరుణ్ సింగ్ భాటిలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ పేజీలో అభినందనలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా రియోకు వెళ్లేముందే అథ్లెట్లను ప్రొత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధిస్తే రూ.75 లక్షలు, అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.
బ్రెజిల్ లోని రియో డి జనీరోలు జరుగుతున్న పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో పాల్గొన్న మరియప్పన్ 1.89 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు
తాజా వార్తలు
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!







