బక్రీద్, గణేశ్ నిమజ్జనం ఒకే రోజు
- September 12, 2016
బక్రీద్, వినాయక నిమజ్జనం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ జీహెచ్ఎంసీ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి ఉమ్మడిగా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24గంటలూ ఉద్యోగులను అందుబాటులో ఉంచనున్నారు. రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఫైర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేయనున్నారు. పటిష్ట పోలీస్ భద్రత, సీసీటీవీ పర్యవేక్షణలో నగరంలో ప్రశాంతంగా బక్రీద్, వినాయక నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓల్డ్‌సిటీలో కవాతు నిర్వహించారు.
తాజా వార్తలు
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!







