న్యాయమూర్తిని హతమార్చిన ఐఎస్ఐఎస్

- August 05, 2015 , by Maagulf
న్యాయమూర్తిని హతమార్చిన ఐఎస్ఐఎస్

అక్కడ వారు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. నాయకులు చట్టాలు శాసనాలు.. చివరకు న్యాయస్థానాలకు కూడా విలువ ఉండదు. జడ్జిలను కూడా విడిచి పెట్టరు. ఇంత ఆటవికంగా వ్యవహరించే వారు ఎవరుంటారు.? ఈ ప్రపంచంలో స్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వ్యవహరించినంత అనాగరికంగా మరెవ్వరూ వ్యవహరించరు. ఓ న్యాయమూర్తిని చంపేశారు. లిబియాలో అల్ కోమ్స్ అపీల్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ అల్ నమ్లిను సిర్ది అనే నగరంలో కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సాయుధులుగా వచ్చి అపహరించుకుపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వం తరుపున ప్రయత్నాలు చేసినా ఉగ్రవాదులు విడిచిపెట్టలేదు. చివరికి చిత్రహింసలు చేసి, నిప్పుపెట్టి కాల్చిన అతడి మృతదేహం అల్ హరవా అనే పట్టణంలో లభించింది. దీంతో లిబియన్ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ కూడా ఆయన మృతి విషయాన్ని ధృవీకరించింది. ఉగ్రవాద నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులకు కఠిన శిక్షలు విధించారనే అక్కసుతోనే ఆయనను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com