`మనలో ఒకడు` ఆడియో సక్సెస్ మీట్ 19న తిరుపతిలో..
- September 13, 2016
ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన `మనలో ఒకడు` ఆడియో ఇటీవల విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాటలకు చక్కటి స్పందన వచ్చిన సందర్భంగా ఈ నెల 19న తిరుపతి వేదికగా ఆడియో సక్సెస్ మీట్ జరగనుంది. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్న చిత్రమిది. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా నటించారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ``మా చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డీటీయస్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 19న తిరుపతిలో సంగీత విజయోత్సవాన్ని నిర్వహిస్తాం. `మనలో ఒకడు` మీడియా నేపథ్యంలో సాగుతుంది. కృష్ణమూర్తి అనే సామాన్య అధ్యాపకుడి కథ ఇది. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా అల్లుకున్నాం`` అని అన్నారు.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ``ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. అందుకే 19న తిరుపతిలో ఆడియో సక్సెస్ వేడుకను నిర్వహిస్తాం. ఈ నెలాఖరున చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం `` అని చెప్పారు.
సాయికుమార్, జెమిని సురేశ్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం, క్రియేటివ్ హెడ్: గౌతమ్ పట్నాయక్, పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ.
తాజా వార్తలు
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!









