రైతే రాజా?
- August 06, 2015
దెబ్బమీద దెబ్బ దెబ్బలన్నీ నాకే
ఇవి నాకేం క్రొత్త కాదు
అధికారులు,పాలకుల లంచాలు వనరుల
దోపిడీ,రాజకీయ ఓటు దోపిడీ
వ్యాపారుల కల్తీమందులు నిత్యావసరాల దోపిడీ,
పైనున్న వాడి నీటి దోపిడీ మధ్య దళారుల చెమట దోపిడీ
ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు
నిరీక్షించే,వ్యర్ధ పదార్థంగా నాకు చెందే హక్కుల దోపిడీ
ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ...
అయినా నాకేం కాలే,దేనికి జన్కలే..
ఎందుకంటే నేను ప్రకృతిని జూసుకొని
మురిసిన వాన్ని,నేను కాలంతో పాటు
నడిసిన వాన్ని,
తిండి గింజల్ని సృష్టించడంలో బిజీ అయిన వాన్ని
కానీ కర్మ కాలి కాలం నాతో కలిసి రావటంలే,
ఇప్పుడిక్కడ
భూమి గొంతు తడారి పోతుంది
చిగురించాల్సిన నా చిన్నారి తోటను
మాడ్చుతూ,చుక్క నీరులేకుండా
ఇక ఇప్పుడు పొల మారిన కాలం
కాళయముడై కురుస్తున్నాడు
వడగళ్ళ వానై,నా యెదపై కాదు కాదు
నా నోటికాడి బువ్వఫై
అయినా నన్ను రాజంటారు మనసున్న
కవులు,రచయితలందరూ..
రైతే రాజు అంటారు ఇంకా ఎందరో మరెందరో..
ఎందుకో..మరి ఏ అవసరానికో,ఎందుకో మరి
నాకీ సానుభూతి మరెందుకో..
భూమిని నమ్మి కష్టాల కడలిలో ఈదుతున్న
నేనిప్పుడు రాజునేనా మరి మీరైనా చెప్పండి?
(12-06-2013. అతివృష్టి అనావృష్టితో గుండె చితికి పోతున్న రైతన్నలు.. )
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







