అస్తమాకు టోమాటోతో చెక్
- August 06, 2015
టోమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను, మలినాలను బయటికి పంపడానికి ఎంతగానో తోడ్పడతాయి. అందుకే టోమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగ నిరోధరక శక్తి పెరుగుతుంది. టొమాటోలోని విటమిన్ సి శరీరానికి తక్షణ శక్తి అందేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు భయంకరమైన కాన్సర్ కారకాలను దూరం చేయడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి టోమాటో వాడకం చాలా వరకూ ఉపశమనం అని చెప్పవచ్చు. టొమాటోలోని లైకోపీన్, విటమిన్ ఎ ఆస్తమాతో నిరంతర పోరాటం చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. అస్తమా రోగులు ప్రతిరోజూ కనీసం ఒకటి గానీ రెండు గానీ టొమాటోలు తమ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు. టొమాటోలు తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. దీని వల్ల ఎముకలు గట్టిపడి, భవిష్యత్తులో కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో టొమాటో వాడకాన్ని ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







