ఢిల్లీ చేరిన నేపాల్ ప్రధాన మంత్రి
- September 15, 2016
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ గురువారం ఢిల్లీ చేరారు. భార్య సీతతో కలిసి వచ్చిన ఆయనకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం అనంతరం ఆగస్ట్ 4న ప్రచండ మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మూడు రోజుల పర్యటనకు వచ్చారు. శుక్రవారం మోదీతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అవుతారు. నేపాల్ కొత్త రాజ్యాంగం ఏర్పాటుతో గత కొద్ది నెలలుగా గాడి తప్పిన ఇరు దేశాల సంబంధాలు ప్రచండ రాకతో మెరుగయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







