మీ మొబైల్ ఇవ్వరూ ...కాస్త మాట్లాడాలని మాయమైన దొంగ అరెస్ట్
- September 15, 2016
మనామా:మహిళ నుంచి మొబైల్ దొంగతనం చేసిన కేసులో ఒక వ్యక్తికి మూడు నెలల కారాగార శిక్ష హై క్రిమినల్ న్యాయస్థానం నిర్ధారించిన తీర్పుపై సంతృప్తి చెందని నిందితుడు అప్పీల్ కోసం దాఖలు చేయగా అతని అభ్యర్ధనని కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే, మాయమాటలు చెప్పి ఓ 33 ఏళ్ల వ్యక్తి మహిళ నుండి మొబైల్ ఫోన్ దొంగిలించాడు.
మూహ్యాయరాక్ వద్ద ఒక చల్లని స్టోర్ వద్ద ఆ వ్యక్తి బాధితురాలిని కలిసి ఒకసారి మొబైల్ లో మాట్లాడాలని తనకు ఫోన్ లేదని ...సెల్ ఫోన్ కోసం ఆమెని అభ్యర్థించినట్లు బాధితుడు తెలిపాడు. అందుకు జాలి పడిన ఆమె తన ఫోన్ ని ఆ వ్యక్తికి ఇచ్చింది.దాంతో అతను కాల్ చేస్తున్నట్లు నటిస్తూ, సిగ్నెల్ ఇక్కడ సరిగా లేదని షాప్ బయటకు వచ్చేడు..ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్ తీసుకొని రెప్పపాటులో అక్కడ్నుంచి పారిపోయాడు. దీనితో ఆ మహిళ తేరుకొని... నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. దోచుకున్న ఫోన్ యొక్క క్రమ సంఖ్య మీద నిఘా ఉంచిన పోలీస్ అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







