తల్లిదండ్రులే ఆ యువతి పాలిట శాపంగా మారారు..
- September 16, 2016
తల్లిదండ్రులే ఆ యువతి పాలిట శాపంగా మారారు. తమ కన్నబిడ్డ 18 ఏళ్ల టీనేజ్ యువతి నగ్న ఫోటోలను స్వయంగా తల్లిదండ్రులే ఫేస్‌బుక్‌లో పెట్టేసిన ఘటన ఆస్ట్రియాలో చోటుచేసుకుంది. 18 ఏళ్ల యువతి ఓ యువకుడితో అన్యోన్యంగా గడుపుతున్న చిత్రాలు, మంచంపై నగ్నంగా పడుకున్న చిత్రాలను ఆమె పర్మిషన్ లేకుండానే.. ఆమె తల్లిదండ్రులే ఫేస్ బుక్‌లో పెట్టేశారు.2009వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు తన కూతురు అశ్లీలంగా ఉన్న 500 చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి ఆయా నగ్న చిత్రాలను తమ 700 మంది స్నేహితులకు షేర్ చేసిన సంఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. ఈ ఫోటోలతో తన పరువు తీశారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది.తన అశ్లీల ఫోటోలను తొలగించమని తాను ఎన్నిసార్లు కోరినా తన తండ్రి వాటిని తొలగించకపోగా, ఆ ఫోటోలు పెట్టే హక్కు తండ్రిగా తనకు ఉందని చెప్పాడని ఆ యువతి వాపోయింది.దీనిపై సదరు బాధిత యువతి తన తల్లిదండ్రులపై కోర్టుకు వెళ్లింది. ఈ కేసు విచారణ నవంబరులో జరుగనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







