గుల్మార్గ్‌లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- October 09, 2026
గుల్మార్గ్, కశ్మీర్: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి గుల్మార్గ్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), ఇతర సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించారు.
రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిగినట్లు సమాచారం.
సమావేశానికి ముందు ఎంపీ బాలశౌరికి డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI) సంస్థల సీఎండీలు, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డైరెక్టర్ ఘన స్వాగతం పలికారు.
రక్షణ రంగానికి చెందిన కీలక సంస్థల ఉన్నతాధికారులు ఒకే వేదికపై సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రక్షణ సామర్థ్యాల బలోపేతం, రక్షణ రంగ సంస్థల పనితీరు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్‌లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







