20 ఏళ్ళ సౌదీ మహిళకు విడాకులు
- September 17, 2016
జెడ్డా: జెడ్డాలోని ఫ్యామిలీ కోర్ట్, 20 ఏళ్ళ సౌదీ మహిళకు విడాకులు (ఖులా) రూలింగ్ ఇచ్చింది. 50 ఏళ్ళపైన వయసు కలిగిన ఆమె భర్త, ఆమెను శారీరకంగా మానసికంగా హింసిస్తూ వచ్చాడు. అంతే కాకుండా హాషిష్ స్మోక్ చేయాల్సిందిగా ఆమెను బలవంతపెట్టాడు. బాధిత మహిళ ఈ విషయాల్ని పోలీసులకు తెలిపింది. 80 శాతం ఖులా కేసులు భర్త చేసే డ్రగ్స్ వేధింపుల కారణంగానే ఉంటున్నట్లు జ్యుడీషియల్ వర్గాల సమాచారాన్ని బట్టి తెలియవస్తోంది. ఇక కేసు విషయానికి వస్తే, స్మోకింగ్కి తాను వ్యతిరేకించిన ప్రతిసారీ తీవ్రంగా తనను కొట్టి, వేధించేవాడని ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. భర్త భౌతిక వేధింపులకు సంబంధించి బాధిత మహిళ, మెడికల్ సర్టిఫికెట్‌ని కూడా సమర్పించింది. అయితే ముందుగా ఆ హింస విషయంలో బుకాయించిన నిందితుడు, ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ చూసి, నేరాన్ని ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన







