బిచ్చగాడికి కలిసొచ్చిన అదృష్టం
- August 07, 2015
ఒక ఊరిలో శివయ్య అనే బిచ్చగాడు ఉండేవాడు. అతను ఇళ్లిళ్లూ బిచ్చమెత్తుకుని రోజూ దొరికినదాంతోనే తన పొట్ట నింపుకునేవాడు. ఒక్కోసారి ఎవరైనా ఆకలి అని వస్తే తను మానుకుని అవతలి వారి ఆకలి కూడా తీర్చేవాడు. అలాగే ఒకరోజు ఒక ఇంటి వద్దకు అమ్మా అన్నం అని అడగ్గా ఒక మహిళ కొద్దిగా అన్నం తెచ్చి శివయ్య బొచ్చెలో వేసింది. అది తీసుకుని ఆ పక్కనే ఉన్న ఒక గోడ దగ్గర కూర్చుని తిందామనుకున్నాడు. అక్కడ దీనంగా బక్కచిక్కిపోయి ఆకలితో నకనకలాడుతూ ఉన్న కుక్క ఒకటి కనిపించింది. అతనికి జాలి వేసింది. నేను నిన్న తిన్నాను కదా. ఈ రోజు తినకపోతే ఏమీ కాదులే అనుకొని పాపం ఈ కుక్క ఎప్పుడు తిన్నదో ఏమో అంత ఆశగా ఆకలిగా చూస్తోంది అనుకుని అతని చేతిలో ఉన్న అన్నాన్ని ఆ కుక్కకి పెట్టాడు. అతని దాన గుణానికి కృతజ్ఞతగా ఆ కుక్క అతను పెట్టిన అన్నం తిన్నాక, అక్కడే ఒక పెద్ద గుంతను తవ్వింది. అందులో బంగారు ఆభరణాలు, డబ్బులతో ఉన్న ఒక సంచి దొరికింది. అది తీసుకుని శివయ్య కుక్క విశ్వాసానికి ఎంతగానో మెచ్చుకుని ఆ డబ్బు సంచినీ, కుక్కని తీసుకుని ఇంటికి వెళ్లి తను కొంత తిని ఆకలి అన్న వారిని ఆదుకుంటూ అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టానికి మిక్కిలి సంతోషించి తృప్తిగా జీవించసాగాడు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







