పుట్టగొడుగులతో పిజ్జా
- August 07, 2015
పుట్టగొడుగులతో పిజ్జా
కావలిసినవి
పుట్టగొడుగులు (మష్రూమ్స్) - 100గ్రా
పాలకూర - రెండు కట్టలు
స్వీట్ కార్న్ - ఒకటి
పుదీనా కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు
మైదా - ఒక కప్పు
పాలు - పావులీటరు
చీజ్ తురుము - ఒక కప్పు
వెన్న - ఆరు టీ స్పూన్లు
బ్రెడ్ పొడి - ఒక చెంచా
ఉప్పు - సరిపడా
మిరియాల పొడి - అర చెంచా
తయారీ విధానం
ముందుగా పుట్టగొడుగులు (మష్రూమ్స్)ని, పాలకూరని సన్నగా తరిగి పక్కన ఉంచాలి. స్వీట్ కార్న్‌ని ఒలిచి, గింజల్ని తీసి ఒక నిముషం పాటు ఉడికించాలి. తరువాత ఒక మందపాటి బాణలి తీసుకుని దానిలో ఆరు చెంచాల వెన్న వేసి, దానిలో సన్నగా తరిగిన మష్రూమ్స్, పాలకూర ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు వేసి దానిలోని నీరు ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. తరువాత మైదా వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించి దానిలో పాలు పోసి దగ్గరకు అయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర తురుము, మిరియాల పొడి, ఉప్పు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అంతా ఓవెన్ గిన్నెలోకి తీసుకుని, గరిటెతో సమంగా సర్ది దాని మీద బ్రెడ్ పొడి, ఛీజ్ తురుము చల్లినట్లుగా వేసి ఓవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉంచి బేక్ చేసి తియ్యాలి. ఇంకేముంది వేడి వేడి మష్రూమ్స్ పిజ్జా రెడీ. సాస్‌తో కలిపి సర్వ్ చేసుకుంటే పుట్టగొడుగుల పిజ్జా తయార్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







