కడలి
- August 07, 2015
ఒంటరిగా
సముద్రపుటొడ్డున
నిలుచుంటే
ఉవ్వెత్తుగా
ఎగిరిపడే
కెరటాలు
అందంగా కనిపిస్తాయి
ఒక్కొక్క అలా
వేగంగా వచ్చి
ఒడ్డును తాకి
మనుగడను
కోల్పోతుంది
నురగలు
కక్కుతూ వచ్చి
నిస్తేజమైపోతుంది
అలా అని భ్రమించి
లోపలికి దిగితే
పలుకరిస్తున్నట్లే
కౌగిలించుకున్నట్లే
అన్పిస్తుంది
ఆపైన అమాంతం
మింగేస్తుంది
కన్నీటిని
ఎందుకని
కడలితో పోలుస్తారు
శోకసంద్రం అని
సమాసంగా చెప్తారు
వెన్నెల రాత్రి
ఒంటరిగా
సముద్రపు
ఒడ్డున
కూర్చుంటే
ఎంత ప్రేమగా
పలకరిస్తుందో
అన్ని ఆలోచనలకు
తను సాక్షిగా
నిలబడుతుందో
యువతీ యువకులు
కేరింతలు కొడ్తూంటే
తన బాహుకెరటాలతో
స్వాగతం పలుకుతుంది
కానీ మితిమీరిన
విశ్వాసంతో
తన గర్భంలోకి
చొచ్చుకువస్తే
సింహంలా
ఆవులిస్తుంది
గుటుక్కున
మింగేస్తుంది
తుపాను వచ్చినా
సునామీ వచ్చినా
కడలి రూపం
కడు భయంకరం
తనను తాను శాసించుకొని
అక్కడనే ఆగిపోయే
సముద్రం అప్పుడు
కాలభైరవుడవుతుంది
మనిషికీ పశువుకూ
తేడా చూపకుండా
కబళిస్తుంది
ప్రకృతి శాంతానికి
ప్రకృతి విలయానికి
సముద్రం
సంకేతం
డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్నం
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







