కార్న్ సబ్జి
- September 20, 2016
కావలసిన పదార్థాలు: లవంగాలు - 7, పచ్చిమిర్చి - 8, యాలకులు - 3, ధనియాలు - 1 టే.స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర - కొద్దిగా
కూరగాయలు: కాప్సికం - 2 (పెనం మీద వేడి చేసి వాటిపై ఉన్న తొక్క తీసి ముక్కలుగా చేయాలి), స్టవ్ మీద కాల్చి చక్రాల్లా కట్ చేసిన కార్న్ - 4,
మెయిన్ ప్రిపరేషన్ కోసం:నూనె - 2 టే.స్పూన్లు, జీలకర్ర - 1 జీలకర్ర, కందిపప్పు - 1 టీస్పూన్, శెనగపప్పు - 1 టీస్పూన్ కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి తరుగు - 1 టీస్పూన్, అల్లం తరుగు - 1 టీస్పూన్, కొబ్బరి తురుము - అర కప్పు, పసుపు - కొద్దిగా, కారం - 1 టీస్పూన్, ఉప్పు, నీరు - తగినంత, చింతపండు పులుసు - 3 టీస్పూన్స్, కొత్తిమీర - కొద్దిగా, గరం మసాలా - 1 టీస్పూన్, నిమ్మరసం - కొద్దిగా .
తయారీ విధానం: పాన్‌లో గరం మసాలా దినుసులన్నీ వేసి వేయించి మిక్సీలో వేసి పక్కనుంచాలి. అదే పాన్‌లో నూనె వేసి జీలకర్ర, కంది పప్పు, శెనగపప్పు వేసి వేయించి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, వెల్లుల్లి, అల్లం కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక కొబ్బరి కోరు వేసి వేయించాలి. కొబ్బరి రంగు మారుతున్నప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం, అర టీస్పూన్ గరం మసాలా, ఉప్పు వేసి అడుగంటకుండా కొద్దిగా నీరు పోయాలి. తర్వాత చింతపండు పులుసు పోసి కార్న్ చక్రాలు, కాప్సికం వేయాలి. దీన్లో కొద్దిగా నీరు పోసి మూత ఉంచి మగ్గనివ్వాలి. సబ్జి ఉడికి దగ్గరికొచ్చాక కొత్తిమీర, కాప్సికం ముక్కలు చల్లాలి. గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి దించేయాలి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







