అల్లు అర్జున్ తొలి తమిళ మూవీ లాంచింగ్ కార్యక్రమం చెన్నైలో..

- September 22, 2016 , by Maagulf
అల్లు అర్జున్ తొలి తమిళ మూవీ లాంచింగ్ కార్యక్రమం చెన్నైలో..

అభిమానుల ఆలోచనలు నిజమయ్యాయి. ఇన్నాళ్ళు బన్నీ తమిళ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్న వేళ తన తమిళ చిత్రం డెబ్యూ పై క్లారిటీ వచ్చింది. స్టార్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ తొలి తమిళ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ రోజు ఉదయం చెన్నైలో ఈ చిత్రానికి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంలో బన్నీ స్పీచ్ తమిళంలో మొదలు పెట్టడం విశేషం. ఎల్లారుకుం వణక్కం ..తప్ప పెసినాలుమ్ తమిళ తా పెసువన్ అంటూ స్పీచ్ ని కొనసాగించాడు. అల్లు అర్జున్ నోటి నుండి తమిళ వ్యాఖ్యాలు రావడంతో ఆడిటోరియం దద్దరిల్లింది.

బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో దువ్వాడ జగన్నాథమ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.
ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు టాక్. ఆ తర్వాత తను తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు బన్నీ. జ్ఞానవేల్ నిర్మాణంలో లింగుస్వామి తెరకెక్కించనున్న ఈ చిత్రం బైలింగ్యుయల్ మూవీగా రూపొందనుండగా తమిళంలోను ఈ హీరో క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయికలుగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. లింగుస్వామి ఇప్పటికే బన్నీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు స్టోరీ డెవలప్ చేసినట్టు తెలుస్తోండగా త్వరలోనే మూవీని పట్టాలెక్కించనున్నట్టు సమాచారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com