ఆస్ట్రేలియా పేరెంట్ వీసా నిబంధనల సవరణలపై సలహాలు ..
- September 23, 2016
తల్లిదండ్రులకు తాత్కాలిక వీసా నిబంధనల సవరణలపై వలసదారుల సలహాలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఐదేళ్ళ టెంపరరీ స్పాన్సర్డ్ పేరెంట్ వీసాలు జారీ చేయడం గురించి పటిష్ఠ విధానాన్ని రూపొందిస్తామని పేర్కొంది. దీనికోసం ప్రవాస భారతీయులు ఏడాదిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనను వారంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. టెంపరరీ స్పాన్సర్డ్ పేరెంట్ వీసాకు సంబంధించిన 5 కీలకాంశాలు : 1. ఆస్ట్రేలియాలోని వలసదారుల తల్లిదండ్రులు ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. వారు ఈ వీసాను పొందేందుకు తమ పిల్లలు తమకు ఆర్థిక మద్దతును ఇస్తున్నట్లు చూపించాలి. హెల్త్ సిస్టమ్‌పై అదనపు భారం పడకుండా ఈ చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
. 2. 2017 జూలైనాటికి ఈ కొత్త వీసా అందుబాటులోకి వస్తుంది. 3.
ఈ వీసాలు ఆస్ట్రేలియన్ సిటిజెన్స్‌కు, పర్మినెంట్ రెసిడెంట్స్‌కు, అర్హతగల న్యూజిలాండ్ సిటిజెన్స్‌కు ఇస్తారు. 4. వీసా ఫీజుల గురించి ఇప్పటి వరకు ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు ఉన్న దాని కన్నా అందుబాటులో ఉంటుందని ఇమ్మిగ్రేషన్ సహాయ మంత్రి హాకే చెప్పారు.
5. అక్టోబరు 31 అర్ధరాత్రి లోగా కమ్యూనిటీ నేతలు తమ అభిప్రాయాలను, సలహాలను ఇవ్వవచ్చు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







