మధ్యాహ్న విరామ చట్టాన్ని అతిక్రమించిన 30 యు. ఏ. ఈ. కంపెనీలు
- August 10, 2015
మధ్యాహ్న విరామ చట్టాన్ని అతిక్రమించిన 30 యు. ఏ. ఈ. కంపెనీలు అతిక్రమించినట్టు ఆ దేశ కార్మికశాఖ వారు ఆదివారం ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం, జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకూ మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటలవరకు శ్రామికులతో పనిచేయించకూడదన్న సంగతి విదితమే. అంతేకాకూడా, యాజమాన్యం పనిగంటలు 8 కంటే ఎక్కువ ఉండకుండా, అదనపు పనిగంటలకు ఓవర్ టైమ్ చెల్లించేలా, నిషేధిత వ్యవధిలో పనిచేయడం అత్యవసరమైతే, శ్రామికులకు చల్లని నీరు, రక్షక పరికరాలు, ఉప్పు, నిమ్మ మరియు ఫ్రెష్ సలడ్లు అందుబాటులో ఉంచాలని కూడా ఈ చట్టం తెలియజేస్తోంది. ఈ సంవత్సరం సదరు శాఖ ఇనస్పెక్టర్లు 27,000 పైగా ఫీల్డ్ పర్యవేక్షణలను చేపట్టారు. గతంతో పోలిస్తే ఈ విధమైన అతిక్రమణలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు వారు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







