లగన్ సారా
- September 24, 2016
కావలసినవి: కారెట్ 100 గ్రా, పచ్చి బఠాణీలు 50 గ్రా, బీన్స్ 50 గ్రా, చిలకడ దుంప 200 గ్రా, ఆలు 100 గ్రా, ఉల్లిపాయలు పావుకిలో, టమోటా 200 గ్రా, బెల్లం 50 గ్రా, వినెగర్ రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 45 గ్రా, నూనె 35 గ్రా, పసుపు కొద్దిగా, ఉప్పు, కారం తగినంత. కొంచెం కరివేపాకు.
ఎలా చేయాలి: ఉల్లిపాయలు, టమోటాలతో సహా అన్ని కూరగాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. మూకుట్లో నూనెవేసి ముందు ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి. తర్వాత టమోటా ముక్కలు, మసాలాలు వేయండి. అవి కొంచెం వేగాక కూరముక్కలన్నీ వేసి బెల్లం, వినెగర్ కలపండి. నూనె పైకి తేలేంతవరకు ఉంచి విడిగా తిరగమోత వేసి కలపండి. ఎండుమిర్చి, కరివేపాకు ఎక్కువ వేస్తే చూడ్డానికి బావుంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన







